దేశంలో మొత్తం ఓటర్లు 96 కోట్ల 88 లక్షలు : ఈసీ

దేశంలో మొత్తం ఓటర్లు 96 కోట్ల 88 లక్షలు : ఈసీ

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది.  లోక్ సభతో పాటుగా నాలుగు రాష్టాలకు  ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటిస్తు్ంది.  దేశంలో మొత్తం ఓటర్లు 96 కోట్ల 88 లక్షల ఓటర్లు ఉన్నట్లుగా సీఈసీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడిస్తున్నారు.  ఇందులో పురుషులు 49 కోట్ల 72 లక్షల మంది ఓటర్లు ఉండగా..  మహిళా ఓటర్లు 47 కోట్ల 15 లక్షలు ఉన్నట్లుగా తెలిపారు. 

 ఇక ట్రాన్స్ జెండర్లు 48 వేల 44 మంది, దివ్యాంగులు 88 లక్షల 35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.  80 ఏళ్లు పైబడిన ఓటర్లు కోటి 85 లక్షలు ఉండగా.. 100 ఏళ్లు పైబడిన 2 కోట్ల 38 లక్షలు ఉన్నట్లుగా ఈసీ తెలిపింది. 18 నుంచి 19 ఏళ్లు వయస్సు కొత్త ఓటర్లు కోటి 84 లక్షలు,  20 నుంచి 29 ఏళ్ల మధ్య ఓటర్లు 19 కోట్ల 74 లక్షలు ఉన్నట్లుగా వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 7 కోట్లు ఓటర్లు పెరిగినట్లుగా ఈసీ తెలిపింది.