మూడు రాష్ట్రాల్లో 14 నియోజకవర్గాల ఉప ఎన్నికలు వాయిదా

మూడు రాష్ట్రాల్లో 14 నియోజకవర్గాల ఉప ఎన్నికలు వాయిదా

నేషనల్ ఎలక్షన్ కమిషన్ నవంబర్ 13న జరగనున్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలను వాయిదా వేసింది. కేరళ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 14 నియోజకవర్గాల పోలింగ్ తేదీ రీషెడ్యూల్ చేసి.. నవంబర్ 20కి మార్చింది ఈసీ. నవంబర్ 13న ఆయా ప్రాంతాల్లో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన  కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుందని రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు బై పోలింగ్ డేట్ ను మార్చాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. దీంతో ఎలక్షన్ కమిషన్ నవంబర్ 13 నుంచి 20కి ఉప ఎన్నికల తేదీని వాయిదా వేసింది. 

పోలింగ్ తేదీని మార్చాలని బిజెపి, కాంగ్రెస్, బిఎస్‌పి మరియు ఆర్‌ఎల్‌డితో సహా పలు రాజకీయ పార్టీలు అభ్యర్థించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతోపాటు ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా నవంబర్ 23న వెల్లడించనున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.

నవంబర్ 13న పంజాబ్‌లో అఖండ పథం, కేరళలో కల్పతి రాస్తోల్‌సవం, ఉత్తప్రదేశ్‌లో కార్తీక పూర్ణిమ పండుగల్లో ప్రజలు పాల్గొంటారు. ఈ పండుగలు మూడు రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఉప ఎన్నికల షెడ్యూల్ ని వాయిదా వేశారు. కేరళలోని పాలక్కాడ్, డేరా బాబా నానక్, చబ్బేవాల్ (SC), పంజాబ్‌లోని గిద్దర్‌బాహా, బర్నాలా, ఉత్తరప్రదేశ్‌లోని ఖైర్ (SC), మీరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, కర్హాల్, సిషామౌ, ఫుల్‌పూర్, కతేహరి, మజావాన్‌లు14 నియోజకవర్గాల ఉప ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి.