V6 News

అధికారుల నిర్లక్ష్యం: చనిపోయిన ఉద్యోగికి ఎలక్షన్‌‌‌‌ డ్యూటీ

అధికారుల నిర్లక్ష్యం: చనిపోయిన ఉద్యోగికి ఎలక్షన్‌‌‌‌ డ్యూటీ

మహబూబాబాద్, వెలుగు: తొమ్మిది నెలల కింద చనిపోయిన ఓ ఉద్యోగికి మూడు విడతల్లో ఎన్నికల డ్యూటీ వేయడం చర్చనీయాంశంగా మారింది. మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలోని తొర్రూరు మండల కేంద్రానికి చెందిన సర్వి రమేశ్‌‌‌‌ విద్యా శాఖలో సీఆర్‌‌‌‌పీ (క్లస్టర్‌‌‌‌ రిసోర్స్‌‌‌‌ పర్సన్‌‌‌‌)గా పనిచేసేవాడు. ఏప్రిల్‌‌‌‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రమేశ్‌‌‌‌ చనిపోయాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో.. రమేశ్‌‌‌‌కు తొలి విడతలో ఇనుగుర్తి, రెండో విడతలో చిన్నగూడూరు, మూడో విడతలో మరిపెడ మండలంలో ఎన్నికల విధులు కేటాయించారు. విధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.