V6 News

ఎన్నికల విధులకు హాజరుకాని..ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్

ఎన్నికల విధులకు హాజరుకాని..ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్

జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధులకు హాజరు కాని ముగ్గురు ఉద్యోగులను  జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సస్పెండ్ చేశారు.  డిసెంబర్ 11 న జరిగిన మొదటి విడత ఎన్నికల సందర్భంగా శిక్షణ తీసుకున్నప్పటికీ విధులకు డుమ్మాకొట్టడంతో  వారిపై వేటుపడింది. 

విధులకు ఎందుకు హాజరు కాలేదో సమాధానం ఇవ్వలని ఉద్యోగులను పలుమార్లు వివరణ ఇవ్వాలని కోరినా స్పందించకపోవడంతో చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికల్లో విధుల నిర్లక్ష్యంతో విధులకు గైర్హాజరైన వెగ్గలం హేమ, పి. రాధ, వంగపల్లి రఘుపతి రావు లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్–1991 రూల్ 8(1) ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారు.