నారాయణపేట ఎమ్మెల్యే పై కోడ్ ఉల్లంఘన కేసు

నారాయణపేట ఎమ్మెల్యే పై కోడ్ ఉల్లంఘన కేసు

నారాయణపేట, వెలుగు : ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డిపై ఎన్నికల అధికారి కేసు నమోదు చేశారని నారాయణపేట జిల్లా బీజేపీ లీగల్  సెల్  కన్వీనర్ నందు నామాజి తెలిపారు. మంగళ వారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే  కోడ్  ఉల్లంఘించారని, నారాయణపేట మండలం అపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి కుమార్తె  చైతన్యకు రూ.2 లక్షల ఎల్ఓసీ అందజేశారని నామాజి పేర్కొన్నారు. అలాగే దామరిగిద్ద మండలంలో వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్  జెండాలను ఆయన ఆవిష్కరించారని తాను చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎన్నికల అధికారి విచారణ జరిపి నిజనిర్ధారణ చేసి ఎమ్మెల్యేరాజేందర్  రెడ్డి పై కేసు నమోదు చేశారని నామాజి తెలిపారు. కేసు నమోదు చేయడమే కాకుండా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్  చేశారు.