బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయిన కే.కేశవరావు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి.. కాంగ్రెస్లో చేరారు. దీంతో ప్రస్తుతం ఆ సీటు ఖాళీగా ఉంది. తెలంగాణాలోని రాజ్య సభ సీటుతోపాటు వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆగస్ట్ 14 నుంచి 21 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
తర్వాత ఆగస్ట్ 27 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉందని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ లో తెలిపింది. సెప్టెంబర్ 3న పోలింగ్.. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటించనున్నారు. రాజ్యసభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వత ఖరారు కానుంది. అభిషేక్ సింఘ్వి ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీలో ప్రచారం నడుస్తోంది.
