టెంట్ తొలగిస్తుండగా కరెంట్ షాక్ ..యువకుడు మృతి, మరో ముగ్గురికి గాయాలు

టెంట్ తొలగిస్తుండగా కరెంట్ షాక్ ..యువకుడు మృతి, మరో ముగ్గురికి గాయాలు

పద్మారావునగర్, వెలుగు:  టెంట్​తొలగిస్తుండగా, కరెంట్​షాక్​తగిలి యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నాందేడ్​కు చెందిన లక్కీ (26) బొల్లారం రీసాలబజార్​లోని ఓ టెంట్​హౌస్​లో కూలీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఒక శుభకార్యం కోసం వేసిన టెంట్​ను మున్నా, విజయ్, సంతోశ్​తో కలిసి లక్కీ తొలగిస్తున్నాడు. ఇనుప నిచ్చెనపై నిలబడి టెంట్​ను విప్పుతుండగా, కరెంట్​షాక్​తగిలింది. ఈ ఘటనలో నిచ్చెనపై ఉన్న వ్యక్తితో పాటు కింద ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా, లక్కీ మార్గమధ్యలో మృతి చెందాడు. మున్నా, విజయ్​, సంతోశ్​కు ట్రీట్మెంట్​కొనసాగుతోంది.