V6 News

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే : మంత్రి పువ్వాడ

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే : మంత్రి పువ్వాడ

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఈ- గరుడ పేరుతో అందుబాటులోకి తెచ్చిన పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఆయన ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, ఓలెక్ట్రా సంస్థ ప్రతినిధులతో కలిసి మంగళవారం( మే16) మియాపూర్ క్రాస్ రోడ్డులో ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దినదినాభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ లోపు 500 ఎలక్ట్రిక్  బస్సులను తీసుకొస్తామని మంత్రి పువ్వాడ తెలిపారు. త్వరలో 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తామన్నారు. హైదరాబాద్ లో ఎలక్ట్రికల్ బస్సులను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చి వాటిని వాటిని మెట్రో స్టేషన్ లకు అనుసంధానం చేస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు 10 వేల బస్సులు ప్రజా రవాణాకు వినియోగిస్తున్నామన్నారు.