బిల్లులు కట్టలేదని.. కాలనీకి కరెంట్ కట్

బిల్లులు కట్టలేదని.. కాలనీకి కరెంట్ కట్

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో 200ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 వేలనుంచి రూ. 90 వేల వరకు కరెంటు బిల్లులు రావడంకలకలం రేపింది. మండల కేంద్రంలో సుమారు200 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు నివసిస్తున్నాయి. పదేళ్లక్రితం ఆ కుటుంబాలకు కరెంట్ మీటర్లు బిగించారు. మీటర్లు బిగించే సమయంలో వద్దంటూ కాలనీవాసులు అడ్డుకోగా వచ్చిన అధికారులు మండల కేంద్రంలో రోజువారి కరెంట్ ఎంత వినియోగిస్తున్నారో తెలుసుకోవడానికే మీటర్లు పెడుతున్నామని చెప్పారు. పదేళ్లుగా రీడింగ్​​తీసుకువెళ్లడమే తప్ప ఎవరికీబిల్లులు ఇవ్వలేదు. గ్రామస్తులు కూడా కట్టలేదు. గతనెలలో ఒక్కసారిగా అందరికీ రూ. వేలల్లో బిల్లులురావడంతో ఆందోళన చెందుతున్నారు. బిల్లులు కట్టలేదంటూ పది రోజుల క్రితం కరెంటు కట్ చేయడంతోగ్రామస్తులు అంధకారంలో గడపాల్సి వస్తోంది. రెక్కాడితేగాని డొక్కాడని తాము అంతంత బిల్లులు ఎలాకట్టగలమని ప్రశ్నిస్తున్నారు. కొన్ని కరెంట్ మీటర్లువినియో గంలో లేవని, పాత బిల్లులను రద్దు చేసిప్రభుత్వం అందిం చే 100 యూనిట్ల కరెంట్ ఫ్రీగాఇవ్వా లని కోరుతున్నారు.

ఎలా లెక్క కట్టారు?

ఒక్కొక్కరికి రూ. వేలల్లో బిల్లులు రావడంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా అధికారులు బిల్లులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్టోబర్ నవంబర్ నెలలో260 యూనిట్లు వినియోగించాడంటూ రూ. 1594బిల్లు వేశారు. పాత బకాయిలు రూ. 72,700 చెల్లించాలని పేర్కొన్నారు. అదే వ్యక్తి నవంబర్ డిసెంబర్నెలలో సున్నా యూనిట్లు వినియోగించినట్లుచూపారు. సాధారణ చార్జీల కింద రూ. 92, పాతబకాయిలు కలిపి రూ. 74,400 చెల్లిం చాలని పేర్కొన్నారు. అసలే చలికాలం, ఇంట్లో చూస్తే అంత భారీగాకరెంటు అవసరమయ్యే వస్తువులే లేవని బాధితుడు పే-ర్కొంటు న్నారు. మరోవైపు యూనిట్లలో ఒక్క నెలలోనేఅంత తేడా ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు.

పాత బిల్లు రద్దు చేయాలి

పదేళ్ల నుంచి విద్యుత్ అధికారులు ఇప్పటి వరకు బిల్లు కట్టాలని అడగలేదు. మొదటే చెప్పి ఉంటే అప్పటి నుంచి కట్టేటోళ్లం . ఇప్పుడు వచ్చి ఒకేసారి బిల్లు మొత్తం కట్టమంటే ఎలా కట్టాలి . మా కుటుంబానికి 30 వేల బిల్లు వచ్చింది. కూలి పని చేసుకుని బతికే మాకు ఆంత డబ్బు ఎక్కడి
నుంచి వస్తుంది . ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మాకు విద్యుత్ సరఫరా చేయాలి . పాత బిల్లులు మాఫీ చేస్తే ఇక నుంచి ప్రతి నెలా బిల్లులు కడతాం.
– బేద సంపత్, ఎస్సీ కాలనీ, ముత్తారం