ఎలక్ట్రానిక్స్​ ఎగుమతులు రూ. 1.6 లక్షల కోట్లకు పెరుగుతాయ్

ఎలక్ట్రానిక్స్​ ఎగుమతులు రూ. 1.6 లక్షల కోట్లకు పెరుగుతాయ్
  • ఇందులో సగం వాటా మొబైల్​ ఫోన్లదే

న్యూఢిల్లీ: ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో ఎలక్ట్రానిక్స్​ ఎగుమతులు 36.8 శాతం పెరిగి రూ. 1.6 లక్షల కోట్లకు చేరతాయని, ఇందులో సగం మొబైల్​ ఫోన్ల ఎగుమతులే ఉంటాయని  ఇండియా సెల్యులార్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​ అసోసియేషన్​ (ఐసీఈఏ) వెల్లడించింది. 2021–22 లో మన  ఎలక్ట్రానిక్స్​ ఎగుమతులు రూ. 1,16,937 కోట్లని పేర్కొంది. 2021–22లో రూ. 45 వేల కోట్ల విలువైన మొబైల్​ ఫోన్ల ఎగుమతులు జరగ్గా, ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో అవి రూ. 75 వేల కోట్లకు మించుతాయని అంచనా వేస్తున్నట్లు ఐసీఈఏ తెలిపింది.  

డిసెంబర్​ 2022 దాకా 9 నెలల కాలానికి ఎలక్ట్రానిక్స్​ ఎగుమతులు రూ. 1,33,313 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. మొబైల్​ ఫోన్ల వల్లే  ప్రధానంగా ఎలక్ట్రానిక్స్​ ఎగుమతులు పెరుగుతున్నట్లు వివరించింది. ఏప్రిల్​– డిసెంబర్​ 2022 మధ్య కాలంలో అనుకున్న విధంగానే మొబైల్​ ఫోన్ల ఎగుమతులు పెరిగాయని, దీంతో టార్గెట్​ 9–10 బిలియన్​ డాలర్లను అందుకోగలమనే నమ్మకం కలుగుతోందని ఐసీఈఏ ఛైర్మన్​ పంకజ్​ మొహింద్రూ చెప్పారు.