పొలాల్లోకి ఏనుగుల మంద.. రైతుల గుండెల్లో దడ

పొలాల్లోకి ఏనుగుల మంద.. రైతుల గుండెల్లో దడ

చిత్తూరు : కుప్పం మల్లప్ప కొండ అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు స్థానికులకు దడ పుట్టిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఏనుగుల మంద ఇక్కడే మకాం వేసింది. రెండు గ్రూపులుగా విడిపోయి…. ఆంధ్ర తమిళనాడు మరోపక్క కర్ణాటక అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గజరాజులు హల్ చల్ చేస్తున్నాయి.

టమోటా, అరటి, బీన్స్, మొక్కజొన్న, ఉద్యానవన పంట పొలాలపై అర్థ రాత్రి వేళల్లో ఏనుగులు వరుస దాడులు చేస్తున్నాయి. రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగుల రాకతో.. కొంగనపల్లి, చిన్నపర్తి కుంట, పెద్ద పర్తి కుంట, సంగనపల్లి, కొత్తూరు, గుడి వంక, గొల్లపల్లి అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు… భయంతో వణికిపోతున్నారు.

ఏనుగుల సంచారంపై సమాచారం అందుకున్న ఆంధ్ర తమిళనాడు ఫారెస్ట్ అధికారులు, ఎలిఫెంట్ ట్రాకర్స్ అలర్టయ్యారు. వాటిని తమిళనాడు హోసూరు దట్టమైన అటవీ సరిహద్దు ప్రాంతాల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.