
బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల ఆట మాత్రమే మిగిలుంది. దీంతో కంటెస్టెంట్స్ ఆడియన్స్ ను మెప్పించడానికి, టైటిల్ విన్ అవడానికి నానా తంటాలు పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ కూడా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో అదిరిపోయే ట్విస్టులు ఇస్తున్నాడు. ఆ ట్విస్టులకి కంటెస్టెంట్స్ మతులు పోతున్నాయి. నిన్న ఏవిక్షన్ పాస్ విషయంలో కూడా అదే రిపీట్ చేశాడు బిగ్ బాస్.
ముందు ఏవిక్షన్ పాస్ అర్జున కు దక్కగా.. అది నిలబెట్టుకోవడానికి మిగతావారితో పోటీపడాలని ట్విస్టు ఇచ్చాడు. అలా.. చివరికి అది యావర్ వద్దకు చేరింది. ఇక కెప్టెన్సీ విషయంలో కూడా అటు.. ఇటు తిప్పి టాస్కులు ఆడించగా.. చివరికి ప్రియాంక ఈవారం కొత్త కెప్టెన్ గా నిలిచారు. అంతటితో ఆగకుండా.. పదకొండవ వారం ఎలిమినేషన్ లో అదిరిపోయే ట్విస్టు ప్లాన్ చేశాడు బిగ్ బాస్.
ఇక పదకొండవ వారానికి గాను నామినేషన్స్ లో అమర్‌దీప్, యావర్, ప్రియాంక, శోభాశెట్టి, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక ఉన్నారు. వీరిలో టాప్ వోటింగ్ తో అమర్ ఉన్నాడు. నిన్నటి ఎపిసోడ్ అమర్ కు బాగా ప్లస్ అయింది అనే చెప్పాలి. ఇక తరువాతి పొజిషన్ లో యావర్, గౌతమ్, అర్జున్ మంచి వోటింగ్ తో దూసుకుపోతున్నారు. ఈవారం ఎలిమినేట్ అవుతుందన్న శోభా ఐదవ స్థానంలో ఉన్నారు. ఫ్యామిలీ వీక్ తరువాత శోభాలో చాలా మార్పు వచ్చింది. అది ఆమెకు చాలా ప్లస్ అయ్యింది. అందుకే వోటింగ్ కూడా బాగా జరిగింది ఆమెకు. ఇక శోభా తరువాతి స్థానాల్లో ప్రియాంక, రతికా ఉన్నారు. ఇక చివరి పొజిషన్ లో అశ్విని ఉన్నారు. దీంతో ఈ వారం అశ్విని హౌస్ నుండి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.
అయితే ఇక్కడే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇవ్వనున్నాడు. అదేంటంటే.. ఈ వారం ఒకరు కాకుండా ఇద్దరినీ బయటకు పంపేలా ప్లాన్ చేస్తున్నారట. అందులో రతికా, అశ్విని ఉన్నారు. అయితే ఈ ఇద్దరు నిజంగా ఈ వారం ఇంటినుండి ఎలిమినేట్ అవుతారా? లేక యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను వాడి రతికాను సేవ్ చేస్తాడా? అనేది తెలియాలంటే సండే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.