
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన ఎలన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ పారిస్ (ఫ్రాన్స్) లో కలిసి లంచ్ చేశారు. టెస్లా బాస్ మస్క్ తన తల్లితో కలిసి లంచ్‌కు అటెండ్ అవ్వగా, ఎల్వీఎంహెచ్ ఓనర్ బెర్నార్డ్ తన కొడుకులు ఆంటోని, అలెగ్జాండర్‌తో కలిసి వచ్చారు. 470 బిలియన్ డాలర్ల విలువైన లంచ్ అంటూ సోషల్ మీడియాలో వీరి ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. వివ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఏడో ఎడిషన్‌లో పాల్గొనడానికి పారిస్ వెళ్లిన మస్క్ ఆర్నాల్ట్‌ను కలిశారు.