మేడారంలో భక్తుల సందడి 

మేడారంలో భక్తుల సందడి 

తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసి, దేవతల గద్దెల వద్దకు చేరుకుని, అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీరె సారే, గాజులు, పూలు పండ్లు, ఒడి బియ్యం సమర్పించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మేడారం పరిసరాల్లోని శివరాం సాగర్, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్న వాగు, వనంలోకి వెళ్లి వంటావార్పు చేసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేడారం ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.