ఎంప్రా లగ్జరీ స్టోర్‌‌‌‌‌‌‌‌లో డిజైనర్ కలెక్షన్స్‌‌‌‌

ఎంప్రా లగ్జరీ స్టోర్‌‌‌‌‌‌‌‌లో డిజైనర్ కలెక్షన్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ప్రముఖ హైదరాబాద్ డిజైనర్ మాధురి ప్రతివాది  పండుగ, పెళ్లిళ్లు, వేర్వేరు సందర్భాలకు తగ్గట్టుగా రూపొందించిన డిజైనర్ కలెక్షన్స్‌‌‌‌ని  హైదరాబాద్‌‌‌‌లోని  ఎంప్రా లగ్జరీ డిజైనర్ స్టోర్‌‌‌‌‌‌‌‌లో ప్రదర్శనకు ఉంచారు.  వారణాసిలోని బనారస్ ఘాట్‌‌‌‌ను చీరపై ప్రత్యేక డిజైన్‌గా వేసిన చీరలు ఇక్కడ ప్రదర్శనకు ఉన్నాయి.  జపాన్ దేశానికి చెందిన  కింజుకు ఆర్ట్‌‌‌‌ స్పూర్తితో  పలు సాంప్రదాయ లేహంగాలు, ఇండో వెస్ట్రన్ డ్రెస్సులు రూపొందించామని మాధురి అన్నారు. 

 హైదరాబాద్ బేస్డ్ డిజైనర్లకు  ప్రాధాన్యత పెరిగిందని, ముంబై,  ఢిల్లీ,  బెంగళూరు,  చెన్నై వంటి నగరాలకు పోటీగా హైదరాబాద్‌‌‌‌లో డిజైనర్ కలెక్షన్స్‌‌‌‌కి డిమాండ్ ఉందని వివరించారు.  తాజా కలెక్షన్స్‌‌‌‌ను  క్రియేటివిటీతోపాటు మన ఇండియన్ కల్చర్‌‌‌‌‌‌‌‌ను ప్రమోట్ చేస్తూ  రూపొందించామన్నారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు మోడల్స్, ఫ్యాషన్ ఇన్‌‌‌‌ఫ్లూయెన్సర్స్,  టాలీవుడ్ స్టైలిష్‌‌‌‌లు   ఎంప్రా లగ్జరీ స్టోర్‌‌‌‌‌‌‌‌లో  సందడి చేశారు.