మాదాపూర్‌‌లో రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్

మాదాపూర్‌‌లో  రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్

రా స్ట్రెంగ్త్ ఆధ్వర్యంలో మాదాపూర్‌‌లో ఆదివారం రా స్ట్రెంగ్త్ కాలిస్థెనిక్స్ చాంపియన్‌‌షిప్ నిర్వహించారు. ఈ పోటీల్లో అథ్లెట్లు, ఫిట్‌‌నెస్ ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పుల్-అప్స్, మసిల్-అప్స్ వ్యాయామాలతో పాటు గ్రావిటీకి వ్యతిరేకంగా చేసే స్టాటిక్ హోల్డ్స్, ఫ్రీస్టైల్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, విరాటపర్వం సినిమా దర్శకుడు వేణు ఉదుగుల పోటీలను ప్రారంభించారు. మొత్తం 90 మంది పాల్గొనగా, వారిలో 22 మంది ఫైనల్‌‌కు చేరుకున్నారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. – మాదాపూర్, వెలుగు