పద్మారావునగర్, వెలుగు : కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మోండా డివిజన్ చాపల బావి ప్రాంతం సెకండ్ బజార్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ నాయకుడు చిర్రబోయిన బద్రీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో, బిగ్ టీవీ, మెడికవర్ హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్‌ల సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
దీన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ప్రారంభించారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన బద్రీనాథ్ యాదవ్‌ను అభినందించారు. టెంపుల్ కమిటీ చైర్మన్ వెంకట్రాజు, నాయకులు శేఖర్, జనార్ధన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
