శ్రీజ కొత్త కొత్తగా సాంగ్ లాంచ్

శ్రీజ కొత్త కొత్తగా సాంగ్ లాంచ్

శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఆల్బమ్ సాంగ్ ‘కొత్త కొత్తగా’. ఈ సాంగ్ లో  ‘దేవగుడి’ ఫేమ్ అభినవ్ శౌర్య హీరోగా నటించాడు.  ఈ పాటకు రఘురామ్ సంగీతంతోపాటు లిరిక్స్‌‌‌‌ను కూడా అందించాడు.  సింగర్ లిప్సిక పాడింది. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో  శ్రీజ మాట్లాడుతూ ‘-నాకు నటన అంటే ప్యాషన్.  ‘రంగస్థలం’ సినిమాలో సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. ఆ తర్వాత మరికొన్ని మూవీస్ లోనూ నటించాను. 

శ్రీజ మ్యూజిక్ ఛానెల్‌‌‌‌లో మేము చేసిన సాంగ్స్ అన్నీ మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ చేశాం. ఈ పాటను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేశాం. ఇది కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’ అని చెప్పింది. ఈ సాంగ్‌‌‌‌లో శ్రీజకు జోడీగా నటించడం ఆనందంగా ఉందని అభినవ్ అన్నాడు. నిర్మాత డీవై చౌదరి, నటులు మేఘన చౌదరి,  సంధ్య,  ఫణి పాల్గొన్నారు.