‘ఎక్స్ మనీ’ వచ్చేస్తోంది.. డిపాజిట్లపై దాదాపు 6 శాతం వడ్డీ కూడా ఇస్తారంట !

‘ఎక్స్ మనీ’ వచ్చేస్తోంది.. డిపాజిట్లపై దాదాపు 6 శాతం వడ్డీ కూడా ఇస్తారంట !

ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్ ‘ఎక్స్’ను  ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చే పనిలో ఉన్నాడు. ఆ లక్ష్యంతోనే ‘ఎక్స్ మనీ’ అనే సరికొత్త ఫైనాన్షియల్ సర్వీస్ ఫీచర్‌‌ను తీసుకొస్తున్నారు. బ్యాంకింగ్, పేమెంట్స్ వంటి ఆర్థిక లావాదేవీలన్నీ ఒకే యాప్‌‌లో చేసేలా దీనిని రూపొందిస్తున్నారు. ఈ యాప్​లో ముఖ్యమైన ఫీచర్లు ఇవే..

ఎక్స్ మనీ ద్వారా యూజర్లు నేరుగా డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్లపై దాదాపు 6% వడ్డీ కూడా వస్తుందని రిపోర్ట్లు చెప్తున్నాయి. ఈ యాప్​ ఉపయోగించి ట్రాన్సాక్షన్స్ చేస్తే వాటిపై 3% వరకు క్యాష్‌‌బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా, ఎక్స్​ యూజర్​ ఐడీతో స్పెషల్​గా మెటల్ వీసా డెబిట్ కార్డును కూడా సంస్థ అందించనుంది. గూగుల్ పే లేదా ఫోన్ పే లాగానే ఒకరి నుంచి మరొకరికి ఎటువంటి ఎక్స్​ట్రా చార్జెస్​ లేకుండా డబ్బును పంపుకోవచ్చు. మస్క్​కు చెందిన ఎక్స్​ ఏఐ డిజైన్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యాప్‌‌లో భాగం కానుంది.

►ALSO READ | వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. 2జీబీ వరకు ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్ !

ఇది యూజర్లు చేసే ఖర్చులను గమనించి, వాటిని కేటగిరీలుగా విడదీసి బడ్జెట్ మేనేజ్‌‌మెంట్‌‌లో సాయపడుతుంది. ఎక్స్ ప్లాట్‌‌ఫామ్‌‌లో ఉన్న క్రియేటర్లు తమ సంపాదనను ఇకపై ఇతర థర్డ్-పార్టీ యాప్స్‌‌తో సంబంధం లేకుండా నేరుగా ఎక్స్ మనీ ద్వారానే పొందొచ్చు.

ప్రస్తుతం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి పేమెంట్ లైసెన్సులను పొందినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీటా వెర్షన్ నుంచి పూర్తి స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకే యాప్‌‌లో సోషల్ మీడియా, షాపింగ్, ఇన్వెస్ట్‌‌మెంట్స్, బ్యాంకింగ్ సేవలు అందించడమే ఈ సూపర్ యాప్ స్పెషాలిటీ.