వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. 2జీబీ వరకు ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్ !

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. 2జీబీ వరకు ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్ !

వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్ కోసం ఇకపై గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా, వాట్సాప్ తన సొంత క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్‌‌ను తీసుకురాబోతోంది. ఈ కొత్త ఫీచర్​తో మీ చాట్​లు, ఫొటోలు, వీడియోలు నేరుగా వాట్సాప్ సర్వర్లలోనే స్టోర్ అవుతాయి. దీనివల్ల గూగుల్ డ్రైవ్‌‌లో స్టోరేజ్ నిండిపోతుందన్న భయం ఉండదు. వాట్సాప్ సుమారు 2జీబీ వరకు ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్ అందించే అవకాశం ఉంది. మీడియా ఫైల్స్ ఎక్కువగా ఉండేవాళ్ల నుంచి కొంత చార్జ్​ చేస్తుంది. 

50 జీబీ స్టోరేజ్ ఇచ్చే ప్లాన్‌‌ను కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ బ్యాకప్ సిస్టమ్ ఎండ్ -టు -ఎండ్ ఎన్‌‌క్రిప్షన్ ద్వారా సేఫ్​గా ఉంటుంది. దీనిని పాస్‌‌వర్డ్ లేదా నెంబర్​లాక్​తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలపింగ్​ దశలో ఉంది. మొదట బీటా యూజర్లకు, ఆ తర్వాత అందరికీ అందుబాటులోకి రానుంది. 

రీచార్జ్​ కూడా ఇందులోనే..
వాట్సాప్ ఇప్పుడు తన యాప్ ద్వారానే నేరుగా మొబైల్ రీచార్జ్ చేసుకునే వీలు కల్పిస్తోంది. అందుకోసం పే యూ వంటి సంస్థలతో టై అప్​ అయిన వాట్సాప్, జియో, ఎయిర్‌‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్ల ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది.

యూజర్లు తమ వాట్సాప్ హోమ్ స్క్రీన్‌‌పై ఉన్న రూపాయి (₹) ఐకాన్‌‌పై క్లిక్ చేసి, ‘మొబైల్ ప్రీపెయిడ్ రీచార్జ్’ ఆప్షన్‌‌ను ఎంచుకుని, నెంబర్, ప్లాన్ వివరాలను ఎంటర్​ చేసి, యూపీఐ లేదా కార్డుల ద్వారా ఈజీగా చెల్లింపులు పూర్తి చేయొచ్చు.