యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు బెయిల్ వచ్చింది

యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు బెయిల్ వచ్చింది

న్యూఢిల్లీ: బిగ్ బాస్ OTT 2 విన్నర్, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ కు బెయిల్ వచ్చింది. పామువిషం సరఫరా కేసులో ఎల్విష్ యాదవ్ కు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది.నోయిడా జైలులో ఉన్న యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ కు 50వేల పూచికత్తుతో ఐదు రోజుల తర్వాత బెయిల్ ఇచ్చారు. బిగ్ బాస్ ఓటీటీ  2 విన్నర్ ..మార్చి 17 నుంచి జైలులోనే ఉన్నాడు. 

రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలతో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు కింద ఎల్విష్ యాదవ్ పై నోయిడా పోలీసులు మార్చి 17న కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఎల్విష్ యాదవ్ మరో ఐదుగురితోకలిసి పాము విషం,  పాములతో వీడియోలు చేసేవాడని, ఎన్ సీఆర్ పరిధిలో రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేసేవాడని పోలీసులు ఆరోపణలతో అరెస్ట్ చేశారు. అనంతరం నోయిడా  జైలుకు  ఎల్విష్ యాదవ్ ను తరలించారు. ఎల్విష్ యాదవ్ ను  14 రోజులు జ్యూడిషియల్ కస్టడీకి పంపారు. 

గురువారం అతని బెయిల్ విచారణపై నోయిడాలోని స్థానిక కోర్టుకు తీసుకువచ్చారు. విచారణ చేపట్టిన కోర్టు అతనిపై విధించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ 18985  ని తొలగించారు. మేం NDPSచట్టాన్ని పొరపాటుగా వినియోగించాం.. అది క్లరికల్ పొరపాటు అని పోలీసులు కోర్టు ముందు ఒప్పుకున్నారు. అయితే ఎన్డీపీఎష్ చట్టం కింద బెయిల్ రావడం చాలా కష్టం. 

ఎల్విష్ యాదవ్ జైలు నుంచి బయటకువస్తున్న వీడియో వైరల్ గా మారింది. అతను బయటకు వచ్చి తన అభిమానుల వైపు చేతులు ఊపడం ఈ వీడియోలో కనిపించింది. అతని ఫ్యాన్ పేజీ ఈ వీడియోను క్యాప్షన్ తో షేర్ చేసింది. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్నపుడు తప్పుడు ఆరోపణలు, అధికారం తలొంచక తప్పదు అని ఈ పోస్ట్ లో రాశారు.