దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్

దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్

ఢిల్లీ : ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీగా అంబులెన్స్ కోసం 108, పోలీసులకు ఫిర్యాదు కోసం 100 ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నంబర్లను ఎమర్జెన్సీలకు ఉపయోగిస్తున్నారు. అయితే ఇక నుంచి ఈ నంబర్లకు చెక్ పెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు ఒకే నంబర్ ను ఎమర్జెన్సీగా అందుబాటులోకి తీసుకురానంది.

కేంద్ర ప్రభుత్వం అమెరికా, కెనడా మరికొన్ని ఇతర దేశాల్లో ఉపయోగిస్తున్న 911 హెల్ప్‌లైన్‌ మాదిరిగా మనదేశంలోనూ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక హెల్ప్‌లైన్‌ నంబరును ఉపయోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ (ERSS) అని పేరు పెట్టారు. దేశ వ్యాప్తంగా 112నంబరును ఇందుకు కేటాయించారు.