అధికారాన్ని కాపాడుకునేందుకే ఎమర్జెన్సీ

అధికారాన్ని కాపాడుకునేందుకే ఎమర్జెన్సీ

అధికారాన్ని కాపాడుకునేందుకు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శాంతి భూషణ్ అనే అడ్వకేట్ లేకపోతే ఇందిరాగాంధీ చేసిన తప్పిదాలు ప్రజలకు తెలిసేవి కావన్నారు. ఎమర్జెన్సీ పెట్టి 46ఏళ్లు అయిన సందర్భంగా సెమినార్ నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారని తెలిపారు. 86లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు.

రాష్ట్రంలో కేసీఆర్ కూడా ఎమర్జెన్సీ పరిస్థితులను అమలు చేస్తున్నారని విమర్శించారు సంజయ్. ప్రశ్నిస్తే పత్రికలను అణిచివేస్తూ..జర్నలిస్టులను TRS ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తోందన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఆనాటి పోరాట చరిత్రను పునికిపుచ్చుకొని ఉద్యమిస్తామన్నారు. సీపీఐ ఎమర్జెన్సీకి మద్దతు తెలిపిందని.. ఇప్పుడు ఎమర్జెన్సీలో పాల్గొన్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్.