
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నాయకులు హైదరాబాద్లో సీఎస్ రామకృష్ణారావును శనివారం కలిశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 5వ డీఏ, పది నెలల డీఏ బకాయిల సహా మొత్తం 10 డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అలాగే, ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపాలని విన్నవించారు.
స్కూల్ విద్యలో సంస్కరణలు చేయాలి: ఎస్టీయూటీయస్
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యలో పలు సంస్కరణలు చేయాలని ప్రభుత్వాన్ని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్ ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. పర్వత్ రెడ్డి, జి. సదానందం గౌడ్ కోరారు. శనివారం స్కూల్ విద్యలో "నమోదు, నాణ్యత, నవ్యత" పేరుతో ఎస్టీయూటీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఉపాధ్యాయుల అనుభవాలతో రూపొందించిన సంస్కరణలు, ప్రతిపాదనల సంపుటిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణా రావుకు అందించారు.