
సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ డివిజన్లలో పని చేస్తున్న 11 మంది ఉద్యోగులకు “మ్యాన్ ఆఫ్ ది మంత్” భద్రతా అవార్డులను సికింద్రాబాద్లోని రైలు నిలయంలో సోమవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అందజేశారు. అవార్డులు భద్రతా విధానాలను అనుసరించడంలో అలాగే ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాయని అరుణ్ కుమార్ జైన్ అన్నారు.
అనంతరం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జోన్ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి సంబంధించి జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. రైల్వే బోర్డు నిర్దేశించిన గడువులోగా పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.