డిసెంబర్‌‌‌‌లో తగ్గిన కొత్త జాబ్స్

డిసెంబర్‌‌‌‌లో తగ్గిన కొత్త జాబ్స్

వాషింగ్టన్‌‌: యూఎస్‌‌లోని ఎంప్లాయర్లు (జాబ్స్ ఇచ్చేవారు) డిసెంబర్‌‌‌‌లో  2,23,000 ఉద్యోగాలను ఇచ్చారు. నవంబర్‌‌‌‌లో ఇచ్చిన 2,56,‌‌‌‌‌‌‌‌‌‌‌‌000 జాబ్స్ కంటే ఇది తక్కువ.  గత రెండేళ్లలో నెలవారీ పరంగా డిసెంబర్‌‌‌‌లోనే తక్కువగా జాబ్స్ పెరిగాయి. యూఎస్‌‌లో అన్‌‌ఎంప్లాయ్‌‌మెంట్ రేటు 3.5 శాతానికి తగ్గిందని లేబర్ డిపార్ట్‌‌మెంట్‌‌ పేర్కొంది. 53 ఏళ్ల కనిష్టానికి చేరువలో ఉందని వివరించింది. కరోనా టైమ్‌‌లో 2.2 కోట్ల మంది ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారని తెలిపింది.  తాజాగా హైరింగ్ యాక్టివిటీ పుంజుకోవడంతో కరోనా టైమ్‌‌లో  జాబ్స్ కోల్పోయిన వారు తిరిగి ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నారని అభిప్రాయపడింది.   హైరింగ్  యాక్టివిటీ, జీతాలు  పెరగడానికి  కారణం ఇన్‌‌ఫ్లేషన్ 40 ఏళ్లకు చేరుకోవడమేనని ఎనలిస్టులు పేర్కొన్నారు. 2023 లో పరిస్థితులు ఎలా ఉంటాయో క్లియర్‌‌‌‌గా అంచనా వేయలేకపోతున్నామని అన్నారు.

ఫెడ్ వడ్డీ రేట్లను వరుస మీటింగ్‌‌లలో పెంచుతుండడంతో   ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో యూఎస్ ఎకానమీ రెసిషన్‌‌లోకి జారుకుంటుందని చాలా మంది ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది చివరి నాటికి యూఎస్‌‌లో అన్‌‌ఎంప్లాయ్‌‌మెంట్ 4.6 శాతానికి చేరుకుంటుందని పేర్కొన్నారు.   ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం వలన ఇన్‌‌ఫ్లేషన్ తగ్గినప్పటికీ, యూఎస్‌‌లో మోర్టగేజ్ లోన్లు, ఆటో, కన్జూమర్‌‌‌‌,  బిజినెస్‌‌ లోన్లపై వడ్డీ భారం పెరిగింది.2022 లో యూఎస్‌‌లోని ఎంప్లాయర్లు 46 లక్షల ఉద్యోగాలను ఇచ్చారు. కాగా, జాబ్స్ డేటా అంచనాలకు అనుగుణంగా ఉండడంతో యూఎస్ మార్కెట్‌లు శుక్రవారం సెషన్‌లో ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.