తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ములుగు జిల్లా వెంకటపూర్ మండలం కర్రగుట్ట దగ్గర జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతదేహాలతో పాటు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఏకే 47, ఎల్ ఎమ్ జీ1 స్వాధీనం చేసుకున్నారు. ఈ కూంబింగ్ లో తెలంగాణ గ్రేహౌండ్స్ పాల్గొన్నారు. బీజాపూర్ లో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్లో కూడా 13 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.