దిల్ రాజుకు మంచు విష్ణు విజ్ఞప్తి

 దిల్ రాజుకు మంచు విష్ణు విజ్ఞప్తి

'మా'లో ఉన్న సభ్యులతోపాటు కొత్తవారిని కూడా ప్రోత్సహించాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజును 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కోరారు. అంతేకాదు, కొత్త నటీనటులకు అవకాశాలిచ్చి 'మా'లో భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ తెలుగు నిర్మాతల మండలితో 'మా' అసోసియేషన్ సభ్యులు సమావేశమైయ్యారు. పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ ఆగస్ట్ 1వ తేదీ నుంచి టాలీవుడ్‌లో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించుకునేందుకు నిర్మాతలు ప్రత్యేకంగా చర్చలు జరిచారు.

ఈ క్రమంలో 'మా' అధ్యక్షుడు మంచు విష్ణును నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు 'మా' సంక్షేమ కమిటీ వినతి పత్రాన్ని దిల్ రాజుకు అందించారు. మంచు విష్ణు కార్యాలయంలో కలిసిన దిల్ రాజు పలు అంశాలపై చర్చించారు. వీరితో పాటు సమావేశంలో మిగతా నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ ద్వారా తెలిపారు.