మేడికుంట లో ఆక్రమణల తొలగింపు

మేడికుంట లో ఆక్రమణల తొలగింపు

జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లిలోని మేడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమించి రహదారి వైపు ఏర్పాటు చేసిన సుమారు 10 మాంసం, చేపల దుకాణాలను హైడ్రా శనివారం తొలగించింది. గతంలో 21 ఎకరాలున్న ఈ చెరువు ఆక్రమణల వల్ల 18 ఎకరాలకు తగ్గిపోవడమే కాకుండా వ్యర్థాలతో కలుషితమవుతోందని హైడ్రాకు ఇటీవల స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఆక్రమణలను తొలగించిన అధికారులు.. చెరువులోకి చెత్త వేయకుండా 10 మీటర్ల ఎత్తుతో ఫెన్సింగ్​ను ఏర్పాటు చేశారు.

మచ్చ బొల్లారంలోనూ కూల్చివేతలుఅల్వాల్, వెలుగు: అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం మార్కెట్​లో ఏళ్ల తరబడి నెలకొన్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ అధికారులు శనివారం భారీ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్​లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించారు.