- ఇరిగేషన్ ఎన్వోసీ..బల్దియా గ్రీన్ సిగ్నల్
- విచారణలో ఆక్రమణ నిజమేనన్న అధికారులు
- చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ, హైడ్రా, బల్దియాలకు ఇరిగేషన్ లెటర్లు
- ఇప్పటివరకు నో యాక్షన్
- ఇప్పటికే ఒక బిల్డింగ్ పూర్తి
మియాపూర్, వెలుగు : హైడ్రా, మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో శేరిలింగంపల్లి మండలం మదీనగూడలో...ఎమ్మెల్యే క్యాంపు అఫీస్‌కు కూతవేటు దూరంలో ఉన్న మియాపూర్పటేల్చెరువు ఆక్రమణకు గురవుతోంది. 48.936 ఎకరాల్లో ఈ చెరువు ఉండగా, కట్ట(బండ్) కింద కృషినగర్ఉంది. ఈ బఫర్‌జోన్ 9 మీటర్ల వరకు ఉంటుంది. బఫర్‌లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దనే రూల్స్ఉన్నాయి. అయితే, గజం ధర రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతుండడంతో బఫర్‌జోన్‌ను ఆక్రమించి మూడు బిల్డింగులు కడుతున్నారు. పైగా, ఈ బిల్డింగులకు గతంలో ఇక్కడ ఇరిగేషన్ ఏఈగా పని చేసి ప్రమోషన్‌పై వెళ్లిన ఓ లేడీ ఆఫీసర్ఎన్ఓసీ ఇస్తే, శేరిలింగంపల్లి జోనల్టౌన్ప్లానింగ్ఆఫీసర్ భవన నిర్మాణానికి అనుమతిచ్చేశారు.
ఇప్పటికే ఓ భారీ భవన సముదాయం పూర్తికాగా, మరో రెండు బిల్డింగుల పనులు కొనసాగుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...బఫర్‌జోన్‌లో బిల్డింగులు కడుతున్నారని కంప్లయింట్స్వస్తే విచారణ జరిపి నిజనేనని తేల్చినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. హైడ్రా, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు యాక్షన్ లోకి దిగాలంటూ ఇరిగేషన్‌శాఖ లెటర్లు రాసి చేతులు దులుపుకుంటోంది. అయితే,
ఇరిగేషన్ ఎన్వోసీ.. మున్సిపల్ నిర్మాణ అనుమతులు
బఫర్జోన్పరిధిలో ఉన్న కృషినగర్కాలనీలోని ప్లాట్‌నెంబర్ 331,332 పార్ట్ లలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు జేఆర్ఎలిగెంట్ఇన్ఫ్రాకు ఇరిగేషన్‌శాఖ ఎన్ఓసీ ఇచ్చింది. నిర్మాణానికి అప్పటి జీహెచ్ఎంసీ(ప్రస్తుతం సీఎంసీ) పరిధిలోని శేరిలింగంపల్లి జోనల్సిటీ ప్లానర్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగానే 4 అంతస్థుల నిర్మాణానికి గత సంవత్సరం ఫిబ్రవరి 1న జోనల్ కమిషనర్పర్మిషన్ఇచ్చారు.
దీంతో నిర్మాణదారులు శరవేగంగా పనులు చేపట్టారు. ఇదే కాలనీలో లోటస్ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్అనే నిర్మాణ సంస్థ కంపౌండ్‌వాల్, భవన సెట్బ్యాక్ఏరియాతో పాటు బిల్డింగ్‌లో కొంత భాగం వరకు బఫర్‌జోన్‌ను ఆక్రమించి నిర్మించారు. దీనికి కూడా ఇరిగేషన్ఎన్ఓసీ ఇవ్వగా, అప్పటి జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు నుంచి అనుమతి కూడా ఇచ్చారు.
లెటర్లు రాసినా నో రెస్పాన్స్
పటేల్ చెరువు బఫర్జోన్ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు జనవరి 23న ఇరిగేషన్అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుస్సేన్‌సాగర్ లేక్స్డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ఇంజినీర్కె. రాజశేఖర్తన సిబ్బందితో కలిసి బఫర్ జోన్లో సర్వే చేశారు. రెండు నిర్మాణ సంస్థలు బఫర్ జోన్‌ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించారు. చర్యలు తీసుకోవాలంటూ ఫిబ్రవరి7 తేదీన శేరిలింగంపల్లి తహసీల్దార్‌కు ఇరిగేషన్‌శాఖ అధికారులు లెటర్‌రాశారు. అలాగే, ఫిబ్రవరి 21న జోనల్కమిషనర్కు, హైడ్రా కమిషనర్లకు యాక్షన్తీసుకోవాలంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్మల్లేశ్లెటర్లు రాశారు. అయితే, ఇప్పటివరకు ఎవరూ యాక్షన్తీసుకోలేదు.
ఎవరేమన్నారంటే...
చెరువు బఫర్జోన్ఆక్రమణ గురించి శేరిలింగంపల్లి తహసీల్దార్మహిపాల్రెడ్డిని వివరణ కోరగా, ‘ఇరిగేషన్‌శాఖ ఎన్వోసీ ఇచ్చి తమను చర్యలు తీసుకోమంటే ఎలాగ..వాళ్లు ఎన్వోసీ రద్దు చేసి జాయింట్సర్వేకు వస్తే అప్పుడు చర్యలు తీసుకుంటాం’ అని సమాధానం ఇచ్చారు. హైడ్రా అధికారులను అడగ్గా ‘మాకు బఫర్‌జోన్‌లో ఉంది..కూల్చివేయండి అని లెటర్రాస్తేనే యాక్షన్తీసుకుంటాం’ అని చెప్పారు.
అయితే, మూడింటిలో ఒక బిల్డింగ్నిర్మాణం పూర్తి కాగా, మరో రెండు భవనాల నిర్మాణాలు ఫాస్ట్‌గా కొనసాగుతున్నాయి. ఒక బిల్డింగులో కొన్ని ఫ్యామిలీలు వచ్చి ఉంటుండగా, ప్లాన్ప్రకారం కట్టలేదని బల్దియా ఎన్వోసీ ఇవ్వలేదు. జాయింట్సర్వే చేసే లోపు మిగతా రెండు బిల్డింగుల నిర్మాణాలు కూడా పూర్తవుతాయని, తొందరగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
జాయింట్ సర్వే చేసి చర్యలు తీసుకుంటాం..
పటేల్‌చెరువు బఫర్జోన్ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తే సర్వే నిర్వహించి ఆక్రమణలు నిజమేనని నిర్ధారించాం. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్‌కు లెటర్లు రాశాం. త్వరలోనే అన్ని శాఖల అధికారులతో కలిసి జాయింట్సర్వే చేసి చర్యలు తీసుకుంటాం.
- గులాముద్దీన్, ఏఈ ఇరిగేషన్
