శివ‌సేన నేత‌కు ఈడీ షాక్

శివ‌సేన నేత‌కు ఈడీ షాక్

ముంబైలో మ‌రో నేత‌పై ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. శివసేన కార్పొరేటర్, బీఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ యశ్వంత్ జాదవ్ నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపింది. జాదవ్ నివాసానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం కూడా చేరుకుంది. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఈడీ అధికారులు ఏ విష‌యంలో జాద‌వ్  ఇంట్లో సోదాలు నిర్వ‌హిస్తున్నార‌న్న విష‌యాలు తెలియాలి. 

1997 నుంచి జాద‌వ్ బీఎంసీ కార్పొరేట‌ర్ గా ఎన్నిక అవుతూ వ‌స్తున్నారు. 2007లో కూడా మ‌రోసారి ఆయ‌న కార్పొరేట‌ర్ గా గెలిచారు. ఆ త‌ర్వాత 2008లో మార్కెట్ గార్డెన్ క‌మిటీ ఛైర్మ‌న్ గా ఎన్నిక‌య్యారు.2011లో డిప్యూటీ శివ‌సేన నేత‌గా ప‌నిచేశారు. 2017లో మ‌రోసారి కార్పొరేట‌ర్ గా గెలిచారు. అదే సంవ‌త్స‌రం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో సభా నాయకుడిగా నియమితులయ్యారు. 2018లో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 

ఇవి కూడా చ‌ద‌వండి: 

ఇండోనేషియాలో భారీ భూకంపం

‘భీమ్లానాయక్’ కారణంగా మరో వాయిదా