ఉద్యోగాల పేరుతో రూ. 720 కోట్లు వసూలు.. ప్రజాపతిపై ఈడీ కేసు

ఉద్యోగాల పేరుతో రూ. 720 కోట్లు  వసూలు.. ప్రజాపతిపై ఈడీ కేసు

జాబ్ ఫ్రాడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  గుజరాత్ కు చెందిన ప్రజాపతిపై ఈడీ కేసు నమోదు చేసింది.  సోషల్ మీడియాలో ఉద్యోగాల పేరుతో లింకులు పంపి రూ. 720 కోట్లు  వసూలు  చేసినట్లుగా గుర్తించిన ఈడీ..  అతనిపై కేసు నమోదు చేసింది.  

ప్రజాపతిపై ఇప్పటికే సీసీఎస్ లో కేసు నమోదైంది.  దుబాయ్‌లో మకాం వేసిన ప్రజాపతి..  ఇండియాలో నిరుద్యోగులను మోసం చేస్తున్నాడు. హవాలా రూపంలో ఉగ్రవాద సంస్థలకు నిధులు పంపుతున్నట్లు అధికారులు తేల్చారు.  

హిజ్బుల్ ముజాహిద్ సంస్థలకు నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. కాగా  తెలంగాణలోని  హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ  పోలీస్ కమిషనరేట్ల పరిధిలో  ప్రజాపతిపై  వందల కేసులు నమోదయ్యాయి. .