హైదరాబాద్లో ఈడీ సోదాలు

హైదరాబాద్లో ఈడీ సోదాలు

హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపాయి. నగరంలో ఏకకాలంలో 8చోట్ల ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. క్యాసినోల లోకల్ ఏజెంట్లైన చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐఎస్ సదన్ లోని ప్రవీణ్ నివాసం, బోయన్ పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి.

ఇండో - నేపాల్ సరిహద్దుల్లో క్యాసినోల నిర్వహిస్తున్నట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిపై ఆరోపణలున్నాయి. పేకాట రాయుళ్లను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుండి స్పెషల్ ఫ్లైట్లలో వెస్ట్ బెంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్‌పోర్టుకు తరలించి.. అక్కడినుండి నేపాల్ లోని హోటల్ మెచి క్రౌన్ లో జూన్ 10 నుంచి 13 వరకు క్యాసినో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో టాలీవుడ్‌, బాలీవుడ్‌, డ్యాన్సర్లతో డ్యాన్సులు చేయించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ఒక్కో కస్టమర్ నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఫెమా నిబంధనల కింద కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహిస్తోంది. చికోటి ప్రవీణ్‌పై గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం.