హైదరాబాద్లో ముగిసిన ఈడీ సోదాలు

హైదరాబాద్లో ముగిసిన ఈడీ సోదాలు

క్యాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి. చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో తెల్లవారు జాము వరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. సైదాబాద్, బోయిన్ పల్లి, కడ్తాల్ లలో దాదాపు 20 గంటల పాటు సోదాలు కొనసాగాయి. ప్రవీణ్ ఇంటి నుంచి మొబైల్స్, ల్యాప్ టాప్ లతో పాటు పలు డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. 

నేపాల్ లో లీగల్ గానే క్యాసినో ఈవెంట్ నిర్వహించినట్లు అధికారులకు చికోటి ప్రవీణ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ల్యాప్ టాప్లో పలు అనుమానాస్పద లావాదేవీలు ఉండటంతో ఈడీ వాటి గురించి ఆరా తీస్తోంది. ముఖ్యంగా పంటర్స్ తో జరిపిన పలు లావాదేవీలపై చికోటి ప్రవీణ్ నుంచి అధికారులు వివరాలు సేకరించారు. హవాలా రూపంలో జరిగిన చెల్లింపులపైనా లోతుగా దర్యాప్తు చేస్తోంది.