యుద్ధాన్ని తలపించిన యాషెస్ చివరి టెస్ట్.. బంతి బంతికి ఉత్కంఠ

యుద్ధాన్ని తలపించిన యాషెస్ చివరి టెస్ట్.. బంతి బంతికి ఉత్కంఠ

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆఖరి టెస్ట్ యుద్ధాన్ని తలపించింది. 384 పరుగుల లక్ష్య చేధనకు దిగిన కంగారులు.. విజయానికి 49 పరుగుల దూరంలో నిలిచిపోయారు. ఒకానొక సమయంలో మ్యాచ్ ఆసీస్ వైపే ఉన్నా.. ఇంగ్లండ్ బౌలర్లు అసాధారణ ప్రతిభ కనబరిచి మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు. 

384 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(60), ఉస్మాన్ ఖవాజా(72) తొలి వికెట్ కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినా.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు దాన్ని కొనసాగించలేకపోయారు. స్టీవ్ స్మిత్(54), ట్రావిస్ హెడ్(43) పరుగులతో రాణించినా.. ఇంగ్లండ్ బౌలర్ల పోరాటం ముందు వారు తలవంచక తప్పలేదు. 334 పరుగుల వద్ద ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతున్న స్టువర్ట్ బ్రాడ్.. మ్యాచ్‌లో చివరి వికెట్ తీసి తన జ్ఞాపకాలను మరింత పదిలం చేసుకున్నారు.

ఈ విజయంతో ఐదు మ్యాచుల యాషెస్ టెస్ట్ సిరీస్ 2-2తో సమం అయ్యింది.

స్కోర్లు:

  • ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్:  283
  • ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్: 295
  • ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్: 395
  • ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్: 334