‘నాగబంధం’ చిత్రం ఆడియెన్స్‌కు విజువల్‌గా గొప్ప ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని చిత్ర సినిమాటోగ్రాఫర్ ఎస్. సౌందరరాజన్ అన్నారు. విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం జులై 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా డివోపీ సౌందరరాజన్ మాట్లాడుతూ ‘స్క్రిప్ట్ స్టేజ్ నుంచే విజువల్‌గా ఎంత గ్రాండ్‌గా, ఎంగేజింగ్‌గా చూపించాలనే ప్లాన్ చేశాం.
సహజమైన లైటింగ్‌తో, కథలో లీనమయ్యేలా నేచురల్‌గా తీశాం. వీఎఫ్‌ఎక్స్ కూడా వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. నేను, డైరెక్టర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ కలిసి తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం సహా చాలా దేవాలయాలు తిరిగాం. అక్కడి ప్రతి అంశాన్ని డీటెయిల్‌గా ఫొటోగ్రాఫ్ చేశాం.
తిరువనంతపురం ఆలయాన్ని ఆధారంగా చేసుకున్నప్పటికీ సినిమాలో ‘శ్రీరంగపురం’ అనే పేరు పెట్టాం. ఆ దేవాలయానికి సంబంధించిన అంశాలపై చాలా రీసెర్చ్ చేశాం. షూటింగ్ సమయంలో కూడా ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిగా చెప్పులు బయటే వదిలి సెట్స్‌లోకి వచ్చేవారు. పూజలు నిర్వహించిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్లం.
చాలా పెద్ద సెట్లలో తీసిన సినిమా ఇది. ఆ మొత్తం సెట్‌ను ఒకే షాట్‌లో చూపించడం చాలెంజ్‌గా అనిపించింది. అందుకోసం చాలా ఖరీదైన డ్రోన్‌ను ఉపయోగించాం. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ, ఎంటర్‌టైన్ చేస్తూ, ఒక డివైన్ అనుభూతిని అందిస్తుంది’ అని చెప్పారు.
