స్వీపర్ ఉద్యోగం : MBA, గ్రాడ్యుయేట్లు దరఖాస్తు

స్వీపర్ ఉద్యోగం : MBA, గ్రాడ్యుయేట్లు దరఖాస్తు

చెన్నై : ఇటీవల ఢిల్లీ సెక్రటేరియట్ లో ఆఫీస్ బాయ్ ఉద్యోగం కోసం కుప్పలుకుప్పలుగా ధరఖాస్తులు వచ్చిన విషయం గుర్తుంది కదూ. 14 పోస్టులకు 7 వేలకు పైగా అప్లే చేసుకున్నారు. అందులోనూ అందరూ డిగ్రీ, పీజీ చదువుకున్నవారే ఉండటం చర్చనీయాంశమైంది. దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పడు ఇలాంటి న్యూసే మరొకటి హాట్ టాపిక్ అయ్యింది.  స్వీపర్‌ పోస్టు కోసం వందల్లో పట్టభద్రులు అప్లై చేశారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.

తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌ లో స్వీపర్‌, సానిటరీ కార్మికుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ పోస్టులకు ఎంటెక్‌, బీటెక్‌, MBA, PG, గ్రాడ్యుయేట్ల నుంచి వందల దరఖాస్తులు వచ్చాయి. వీరితో పాటు డిప్లామో పట్టా పొందిన వారు కూడా స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 10 స్వీపర్‌ పోస్టులు, 4 శానిటరీ కార్మికుల పోస్టులకు గాను గత ఏడాది సెప్టెంబర్‌ 26న తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. సంబంధిత విభాగంలో అనుభవం ఉంటే సరిపోతుందని తెలిపింది.

దీంతో ఎంప్లాయిమెంట్‌ ఎక్సైంజ్‌తో సహా మొత్తం 4,607 దరఖాస్తులు అందాయి. వీరిలో డిగ్రీలు, MBA లు, బీటెక్‌ లు చదివిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో సరైన వివరాలు నమోదు చేయనందున 677 మంది దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించారు. స్వీపర్ ఉద్యోగాలకు డిగ్రీలు, పీజీలు చదివిన వారు అప్లై చేసుకోవడంతో… అధికారులు సైతం అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ న్యూస్ పై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతుందని.. లక్షల్లో యువత డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌ లు చదివి.. కొలువుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ అయిన లక్షల్లో అప్లై చేస్తున్నారని.. చదివిన చదువుకు, కొలువుకు సంబంధం ఉండటం లేదంటున్నారు.