IND VS ENG 2025: మ్యాచ్‌కు ముందు మౌనం పాటించిన ఇండియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు.. కారణమిదే!

IND VS ENG 2025: మ్యాచ్‌కు ముందు మౌనం పాటించిన ఇండియా, ఇంగ్లాండ్ క్రికెటర్లు.. కారణమిదే!

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో బుధవారం (జూలై 2) ఇండియా, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ తర్వాత ఇరు జట్ల క్రికెటర్లు బ్లాక్ ఆర్మాండ్స్ ధరించి ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ 71 సంవత్సరాల వయస్సులో స్వల్ప అనారోగ్యంతో మరణించారు. దీంతో అతనికి ఇండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు నివాళులు అర్పించారు. తొలి టెస్ట్ జరుగుతున్నప్పుడు భారత మాజీ ఆటగాడు దిలీప్ జోషీ మరణించిన సందర్భంలోనూ ఇరు జట్ల ఆటగాళ్లు తమ నివాళులు అర్పించడం విశేషం. 

నెడ్" గా ప్రసిద్ధి చెందిన లార్కిన్స్.. 1979-1991 మధ్య  ఇంగ్లాండ్ తరపున 13 టెస్టులు, 25 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 1979 లో ఇంగ్లాండ్ వన్డే వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు. ఈ వరల్డ్ కప్ లో లార్కిన్ 7వ స్థానంలో బ్యాటింగ్ చేసి రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. లార్కిన్స్ కి ఆరుయ్ టెస్టులు ఆడిన తర్వాత ఏడవ టెస్ట్ ఆడడానికి అతనికి ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది. స్ట్రోక్‌ప్లేకు ప్రసిద్ధి చెందిన లార్కిన్స్.. తన కెరీర్‌లో ఎక్కువ భాగం నార్తాంప్టన్‌షైర్‌ జట్టుకు ఆడాడు. నార్తాంప్టన్‌షైర్‌ క్లబ్ తరపున 700 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి  40,000 పరుగులు.. 85 సెంచరీలతో తన కెరీర్ ను ముగించాడు. 

►ALSO READ | IND VS ENG 2025: బ్యాలన్స్ అదిరింది.. బ్యాటింగ్ డెప్త్ పెరిగింది: రెండో టెస్టుకు టీమిండియా ఆర్డర్ ఇదే!

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్ (2) వోక్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. 26 బంతులు ఎదర్కొన్న రాహుల్.. 2 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం క్రీజ్ లో జైశ్వాల్ (12), కరుణ నాయర్ (0) ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మార్పులు ఏమీ చేయలేదు. మరోవైపు ఇండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. సాయి సుదర్శన్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్ స్థానాల్లో సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చారు.