IND vs ENG 2025: రేపే టీమిండియాతో తొలి టెస్ట్.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్

IND vs ENG 2025: రేపే టీమిండియాతో తొలి టెస్ట్.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఇంగ్లాండ్

భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం (జూన్ 20) లీడ్స్ వేదికగా హెడ్డింగ్లీలో తొలి టెస్ట్ జరగనుంది. 2025-2027 టెస్ట్ సైకిల్ లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి సిరీస్. ఈ సిరీస్ లో ఆతిధ్య ఇంగ్లాండ్ క్లియర్ ఫేవరేట్ గా కనిపిస్తుంది. మరోవైపు కుర్రాళ్లతో నిండిన భారత జట్టు ఎలా రాణిస్తారో ఆసక్తికరంగా మారింది. యువ కెప్టెన్ శుభమాన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ కు షాక్ ఇవ్వాలని భారత్ భావిస్తుంది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం సొంతగడ్డపై భారత్ ను చిత్తు చేయాలని భావిస్తుంది. ఇదిలా ఉంటే తొలి టెస్ట్ కోసం ఇంగ్లాండ్ జట్టు తమ ప్లేయింగ్ 11 ప్రకటించింది. 

బుధవారం (జూన్ 18) ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన ప్లేయింగ్ 11 లో 5 గురు బ్యాటర్లు.. ఒక వికెట్ కీపర్.. ఒక ఆల్ రౌండర్.. ముగ్గురు స్పెషలిస్ట్ సీమర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఓపెనర్లుగా బెన్ డకెట్, జాక్ క్రాలీ ఆడనున్నారు. మూడో స్థానంలో పోప్ బ్యాటింగ్ చేస్తాడు. సీనియర్ బ్యాటర్ జో రూట్, యువ సంచలనం హ్యారీ బ్రూక్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తారు. కెప్టెన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. 

సూపర్ ఫామ్ లో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ ఏడో స్థానంలో ఆడతాడు. సీనియర్ బౌలర్ క్రిస్ వోక్స్, జోష్ టంగ్,బ్రైడాన్ కార్సే ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా షోయబ్ బషీర్ కు తుది జట్టులో స్థానం దక్కింది. యువ బ్యాటర్ బెథెల్‌తో పాటు, సామ్ కుక్, జామీ ఓవర్టన్‌లు బెంచ్ కు పరిమితమయ్యారు.  గస్ అట్కిన్సన్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్ట్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.  

టెస్ట్ సిరీస్ లో భాగంగా లీడ్స్‌లోని హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది. 2024 ప్రారంభంలో ఇంగ్లాండ్, భారత్ చివరిసారిగా టెస్ట్ సిరీస్ ఆడాయి. ఈ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది. 

ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ 2025 టెస్ట్ సిరీస్ షెడ్యూల్

1వ టెస్ట్: జూన్ 20-24 - హెడ్డింగ్లీ, లీడ్స్
2వ టెస్టు: జూలై 2-6 - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్టు: జూలై 10-14 - లార్డ్స్, లండన్
4వ టెస్టు: జూలై 23-27 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్టు: జూలై 31-ఆగస్టు 4 - కియా ఓవల్, లండన్    

టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:

బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్

🚨 ENGLAND 11 FOR THE FIRST TEST vs INDIA 🚨

- Crawley, Duckett, Pope, Root, Brook, Stokes (C), Smith, Woakes, Carse, Tongue, Bashir. pic.twitter.com/fSdzz87WSP

— Johns. (@CricCrazyJohns) June 18, 2025