Cricket World Cup 2023: పర్వాలేదనిపించిన ఇంగ్లాండ్.. కివీస్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ 

Cricket World Cup 2023: పర్వాలేదనిపించిన ఇంగ్లాండ్.. కివీస్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ 

బజ్ బాల్ అంటూ ప్రపంచ క్రికెట్ ని శాసించాలనుకున్న ఇంగ్లాండ్ ఆటలు ఇండియాలో సాగలేదు. ఫలితంగా వరల్డ్ కప్ తొలి మ్యాచులో కివీస్ బౌలర్ల ధాటికి  సాధారణ స్కోర్ కే పరిమితమైంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో  భాగంగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచులో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. సాధారణంగా ఇది మంచి  స్కోరే అయినా ఇంగ్లీష్ బ్యాటర్లను కివీస్ బౌలర్లు నిలువరించారనే చెప్పాలి. దీంతో కివీస్ కి డీసెంట్ టార్గెట్ ని సెట్ చేసింది.
 
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కి బెయిర్ స్టో తొలి ఓవర్లోనే మెరుపు ఆరంభాని ఇచ్చాడు. రెండో బంతికే సిక్సర్ కొట్టి ఇండియాలో కూడా మా తీరు మారదు అని చెప్పకనే చెప్పాడు. మరో ఎండ్ లో మాత్రం మలాన్ ఆచి తూచి బ్యాటింగ్ చేస్తూ తక్కువ స్కోర్ కే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ తక్కువ  స్కోర్ కే పరిమితమయ్యారు. 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ బట్లర్ తో కలిసి రూట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ని ఆదుకునే ప్రయత్నం చేసాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కి 70 పరుగులు జోడించిన తర్వాత బట్లర్ 43 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ఇక ఆ తర్వాత ఏ బ్యాటర్ కూడా క్రీజ్ లో కుదురుకోకపోవడంతో 9 వికెట్లకు 252 పరుగులు చేసి కష్టాల్లో నిలిచింది. అయితే చివరి వికెట్ కి ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ 30 పరుగులు జోడించి ఇంగ్లాండ్ కి గౌరవప్రదమైన స్కోర్ ని అందించారు. ఇంగ్లాండ్ జట్టులో రూట్ 77 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ జట్టులో హెన్రికి 3, సాంట్నర్,ఫిలిప్స్ కి చెరో రెండు వికెట్లు లభించాయి.