150వ లార్డ్స్ టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం.. వర్షం దెబ్బకి ఆగిన ఇంగ్లాండ్ బ్యాటింగ్!

150వ లార్డ్స్ టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం.. వర్షం దెబ్బకి ఆగిన ఇంగ్లాండ్ బ్యాటింగ్!

ENG vs NZ: ఇంగ్లాండ్‌లోని నార్త్ లండన్ వేదికగా న్యూజిలాండ్‌తో మొదలైన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ తొలి రోజే వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. క్లౌడీ వెదర్ బౌలర్లకు హెల్ప్ అవుతుందని టాస్ గెలిచిన బ్లాక్‌క్యాప్స్ కెప్టెన్ టామ్ లాథమ్ మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. లంచ్ టైం లోపే భారీ వర్షం పడటంతో కేవలం 50 నిమిషాల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం వల్ల ఆట ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 24 రన్స్ మాత్రమే చేసింది. క్రీజులో బెన్ డకెట్ (12 నాటౌట్), జాకబ్ బెథెల్ (4 నాటౌట్) ఉన్నారు.

ఫస్ట్ బాల్‌కే ఫోర్ కొట్టినా: 
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయిన (4-1 ఓటమి) ఇంగ్లాండ్.. ఓపెనర్ జాక్ క్రాలేపై వేటు వేసి అతని స్థానంలో డర్హామ్ కౌంటీ ప్లేయర్ 'గే' కి ఛాన్స్ ఇచ్చింది. ఇక మ్యాట్ హెన్రీ వేసిన ఫస్ట్ ఓవర్ మెయిడెన్ అవ్వగా.. కైల్ జేమీసన్ వేసిన తర్వాతి ఓవర్లో గే క్రీజులోకి వచ్చాడు.. రావడం రావడమే ఇంగ్లాండ్ లెజెండ్ డేవిడ్ గోవర్ స్టైల్‌లో టెస్ట్ క్రికెట్‌లో తను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌కే క్లాసిక్ స్క్వేర్ డ్రైవ్‌తో ఫోర్ కొట్టి ఖాతా ఓపెన్ చేశాడు.  

జేమీసన్ మైండ్ బ్లోయింగ్ డెలివరీ:
తొలి మ్యాచ్‌లోనే కాస్త కాన్ఫిడెంట్‌గా కనిపించిన గే.. కేవలం 8 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. రౌండ్ ది వికెట్ వచ్చి జేమీసన్ వేసిన ఒక అదిరిపోయే లెంత్ బాల్.. గే బ్యాట్ అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న డారిల్ మిచెల్ ఎలాంటి మిస్టేక్ చేయకుండా లో-క్యాచ్ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. ఇటలీ తరఫున ఆడి, ఒకప్పుడు వెస్టిండీస్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన ఈ 26 ఏళ్ల బ్యాటర్.. డెబ్యూ మ్యాచ్‌లోనే కేవలం 8 పరుగులకే అవుట్ కావడంతో ఇంగ్లీష్ ఫ్యాన్స్‌ని కాస్త డిజప్పాయింట్ చేసింది.

న్యూజిలాండ్ బౌలర్ల డామినేషన్: 
టాస్‌కు తగ్గట్టే పిచ్ నుంచి న్యూజిలాండ్ పేసర్లకు మంచి మూవ్‌మెంట్ లభించింది. ముఖ్యంగా వికెట్ తీసిన జేమీసన్ వర్షం పడటానికి ముందు వేసిన 5 ఓవర్లలో కేవలం 16 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసి ఇంగ్లాండ్ బ్యాటర్లపై గట్టి ప్రెజర్ పెట్టాడు. కాగా కౌంటీల్లో పరుగుల వరద పారించి టీమ్‌లోకి వచ్చిన గే.. ఫస్ట్ మ్యాచ్‌లోనే 'ఫ్లాప్ షో' (8 రన్స్) చూపించాడు. మరి వర్షం తగ్గాక ఇంగ్లీష్ టీమ్ మిగతా బ్యాటర్లు న్యూజిలాండ్ పేస్ అటాక్‌ను ఎలా తట్టుకుంటారో అనేది చూడాలి మరీ.