
ముల్తాన్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. పాక్ అరంగేట్రం స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (7/114) స్పిన్ మ్యాజిక్‌కు శుక్రవారం తొలి రోజు ఇంగ్లిష్ టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 51.4 ఓవర్లలో 281 రన్స్‌కు ఆలౌటైంది. డంకెట్ (63), ఓలీ పోప్ (60), మార్క్ వుడ్ (36 నాటౌట్), విల్ జాక్ (31), బెన్ స్టోక్స్ (30) మినహా మిగతా వారు నిరాశపర్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు డంకెట్, పోప్ రెండో వికెట్‌కు 79 రన్స్ జోడించారు. కానీ అబ్రార్ బౌలింగ్‌లో టాప్-–7 బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో 107/2 స్కోరు చేసింది. బాబర్ (61 బ్యాటింగ్), షకీల్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.