
షాద్ నగర్,వెలుగు: పర్యావరణాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధి ఫరూక్ నగర్ మండలం కమ్మదనం ఫారెస్ట్ రేంజ్ లో ఆదివారం ఎమ్మెల్యే వనమహోత్సవ కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. కమ్మదనం పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు గురుకుల పాఠశాల విద్యార్థులతో పాటు స్థానిక నేతలు ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. వన మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్లు మొక్కలు పెంచడమే ప్రభుత్వం ధ్యేయమని పేర్కొన్నారు. ఒక్కొ వ్యక్తి ఐదు నుంచి పది మొక్కల పెంచాలని సూచించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్ గౌడ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అజీజ్,కమ్మదనం మాజీ ఎంపీటీసీ అరుణ,మాజీ సర్పంచ్ నర్సింలు,మాజీ జడ్పీటీసీ వెంకట్రాం రెడ్డి ,కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తదితరులు పాల్గొన్నారు.