పాల్వంచ, వెలుగు: సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిన సింగి ల్ యూస్డ్ ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కొత్తగూడెం కార్పొరేషన్ కార్పొరేటర్ డాక్టర్ బి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, పాల్వంచ స్టోరీస్ ఇంస్టా గ్రామ్ పేజీ ఆధ్వర్యంలో తయారుచేసిన 10వేల జూట్ బ్యాగులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్థానిక హెచ్ కన్వెన్షన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ ను నివారించడం తప్పితే మరో మార్గం లేదన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సునీల్, డాక్టర్ అమరేందర్ రెడ్డి, అల్లి శరత్, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేశ్పాల్గొన్నారు.
