తెలంగాణ రైజింగ్‌‌‌‌ కాదు క్లోజింగ్‌‌‌‌ ..రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశంలో వక్తలు

తెలంగాణ రైజింగ్‌‌‌‌ కాదు క్లోజింగ్‌‌‌‌ ..రౌండ్‌‌‌‌ టేబుల్‌‌‌‌ సమావేశంలో వక్తలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల పాలనలో చేసిందేమీ లేదని బీఆర్‌‌‌‌ఎస్ నేత, ఎస్సీ-ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్​ఎరోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో  తెలంగాణ నాలెడ్జ్ క్రియేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా సెంటర్ డైరెక్టర్ గోసుల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షత  వహించారు. 

ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ..  రెండేండ్ల పాలనలో దోపిడీ, విధ్వంసాలు మాత్రమే జరిగాయని, తెలంగాణ రైజింగ్ కాదని, క్లోజింగ్ దిశగా పయనిస్తుందని ఆరోపించారు.  కార్పొరేషన్ మాజీ చైర్మన్​పల్లె రవికుమార్ మాట్లాడుతూ హైదరాబాద్‌‌‌‌ను కేంద్రానికి అప్పగించాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఉద్యమకారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంకట్‌‌‌‌రెడ్డి, టీజీపీఎస్సీ మాజీ మెంబర్​సుమిత్రానంద, వాసుదేవరెడ్డి, ప్రొఫెసర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.