రైతుల సంక్షేమానికి కృషి చేయాలి : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు 

రైతుల సంక్షేమానికి కృషి చేయాలి : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు 

కాశీబుగ్గ, వెలుగు : రైతులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వ్యాపారం చేయాలని పంచాయతీరాజ్‌‌‌‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు సూచించారు. వరంగల్‌‌‌‌ ఏనుమాముల మార్కెట్‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన వరంగల్‌‌‌‌ ఛాంబర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఇండస్ట్రీ ప్లాటినం జూబ్లీ వేడుకలు మంత్రితో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌ బండా ప్రకాశ్, ప్రభుత్వ చీఫ్‌‌‌‌ విప్‌‌‌‌ వినయ్‌‌‌‌భాస్కర్‌‌‌‌, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌‌‌‌, నరేందర్, మాజీ స్పీకర్‌‌‌‌ మధుసూదనాచారి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌‌‌‌రావు మాట్లాడుతూ వరంగల్‌‌‌‌ ఛాంబర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌కు ఎంతో చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఛాంబర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌ ముందు వరుసలో ఉందన్నారు. కార్మికులు, రైతుల సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని సూచించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు ఇవ్వడంతో పాటు రైతు బంధు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం రైతులను సన్మానించారు.

వేడుకల సందర్భంగా కళాకారులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.  ఛాంబర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌ ప్రెసిండెంట్‌‌‌‌ బొమ్మినేని రవీందర్‌‌‌‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్‌‌‌‌లో కూడా చైర్మన్‌‌‌‌ సుందర్‌‌‌‌రాజ్‌‌‌‌, ఛాంబర్‌‌‌‌ కార్యవర్గ సభ్యులు వేద ప్రకాశ్, చంద్రమౌళి, అలె సంపత్, సాగర్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు హరినాథ్, రాజేశ్వర్‌‌‌‌రావు, సుమన్‌‌‌‌, సంపత్, సత్యనారాయణ, చక్రధర్, ప్రభాకర్, యుగేంధర్‌‌‌‌, గోయల్, మాజీ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి, కటకం పెంటయ్య, కంభంపాటి కుమారస్వామి, తమిక రమేశ్‌‌‌‌బాబు పాల్గొన్నారు.

 డ్రోన్‌‌‌‌ స్ర్పేయర్‌‌‌‌ ప్రారంభం

వరంగల్ ఏనుమాముల మార్కెట్‌‌‌‌లోని మన అగ్రిటెక్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌ బండా ప్రకాశ్‌‌‌‌ కలిసి డ్రోన్‌‌‌‌ స్ర్పేయర్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రోన్‌‌‌‌ స్ప్రేయర్‌‌‌‌ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.  

గౌడ సంక్షేమానికి కృషి చేస్తా

తొర్రూరు, వెలుగు :  మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన గౌడ సంఘాల లీడర్లు ఆదివారం హనుమకొండలో మంత్రి దయాకర్‌రావును కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌడ కులస్తుల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తొర్రూరులో గౌడ కమ్యూనిటీ హాల్, ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణానికి స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్‌ గౌడ్‌, ఐజేయూ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు దూలం శ్రీనివాస్‌గౌడ్‌, తాళ్లపల్లి రమేశ్‌, రాయిపెళ్లి యాకయ్య, కొయ్యడ కుమారస్వామి, కౌండిన్య, నాగపురి అశోక్‌గౌడ్‌, కోటగిరి కుమార్ గౌడ్ ఉన్నారు. అనంతరం జమస్తాన్‌పురం సర్పంచ్‌ జూరెడ్డి రవీందర్‌రెడ్డి చనిపోవడంతో ఆదివారం మంత్రి దయాకర్‌రావు గ్రామానికి వెళ్లి నివాళి అర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.

కమ్యూనిటీ హాల్‌‌‌‌కు శంకుస్థాపన

హనుమకొండ, వెలుగు : హనుమకొండ అలంకార్‌‌‌‌ జంక్షన్‌‌‌‌లో కల్గిధర్‌‌‌‌ గురుద్వార సాయబ్‌‌‌‌ సిక్కు కమ్యూనిటీ హాల్‌‌‌‌ నిర్మాణానికి ఆదివారం ప్రభుత్వ చీఫ్​విప్‌‌‌‌ వినయ్‌‌‌‌భాస్కర్‌‌‌‌తో కలిసి మంత్రి దయాకర్‌‌‌‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలు అమలు చేయని మోదీ ఇప్పుడు ఓట్ల కోసం డ్రామాలు మొదలు పెట్టారన్నారు. మతాల మధ్య గొడవలు పెట్టేందుకే ప్రధాని తెలంగాణకు వచ్చాడన్నారు. ఎన్నికలు రాగానే గిరిజన యూనివర్సిటీ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఎలక్షన్లు వచ్చాయనే నిజామాబాద్‌‌‌‌కు పసుపు బోర్డు మంజూరు చేశారన్నారు. కాజీపేట కోచ్‌‌‌‌, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.