
తెలంగాణ రాష్ట్రంలో ఇఎస్ఐ ఆస్పత్రి డిస్పెన్సరీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది మత జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. తమ జీవితాలను పెంచని పక్షంలో విధులను బహిష్కరించి సమ్మెకు దిగనున్నట్లు హెచ్చరించారు. మే 4వ తేదీ గురువారం ఔట్సోర్సింగ్ సిబ్బంది ఇఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా తాము విధులను నిర్వహించామని.. ప్రభుత్వం తమ సేవలను గుర్తించి జీతాలను పెంచకపోవడం దారుణమని అన్నారు. ఔట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది జీతాలు పెంచకపోవడం.. వారికి సరైన సెలవులు కూడా అమలు చేయట్లేదని వాపోయారు. సమ్మె నోటీసును ఈఎస్ఐ డైరెక్టరేట్ అధికారికి అందజేసి మే 17వ తేదీ నుండి పూర్తిగా విధులు బహిష్కరిస్తామని సిబ్బంది వెల్లడించారు.