మాస్కులు, శానిటైజేషన్ శ్రీరామ రక్ష..లాక్ డౌన్ లు, బంద్లు కాదు

మాస్కులు, శానిటైజేషన్  శ్రీరామ రక్ష..లాక్ డౌన్ లు, బంద్లు కాదు

కోవిడ్ కు నిజమైన మందు ఆక్సిజన్ మాత్రమేనన్నారు మంత్రి ఈటెల రాజేందర్. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఈటెల రాజేందర్ .. ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ ఉన్నవారికి మొదట ఇచ్చే మందు ఆక్సిజనేనన్నారు. మాస్కులు, సానిటైజేషన్ మాత్రమే శ్రీరామ రక్ష..లాక్ డౌన్ లు, బందులు కాదన్నారు. ఎవరిమీద ఆధారపడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గాంధీని కోవిడ్ కేర్ గా మార్చినప్పుడు చాలా వ్యతిరేకత వచ్చిందని.. మొదటి పేషంట్ తో తాను నేరుగా ఇంటరాక్ట్ అయ్యానన్నారు. సంవత్సరం గడిచిన తర్వాత కరోనాకు చంపగలిగే శక్తి లేదని అర్థమైందన్నారు. 

దేశవ్యాప్తంగా 1.21 శాతం మరణాలు సంభవిస్తే తెలంగాణ లో మరణాల శాతం 0.56 శాతం మాత్రమేనన్నారు. ఆర్ ఎన్ ఏ వైరస్ షేప్ మార్చుకునే అవకాశం ఎక్కువని.. షేప్ మార్చుకున్నప్పుడు వ్యాక్సిన్ పనిచేయదన్నారు. 25 ఏళ్ల వయసున్న వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు.కోవిడ్ తో కలిసి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వైద్య సదుపాయలకు లోటు లేదన్నారు. నిర్లక్ష్యం చేసిన వాల్లే చనిపోతున్నారని.. వెంటిలేటర్ వరకు వెళ్లినవారు బ్రతకడం కష్టం అవుతుందన్నారు. అందరికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐసిఎమ్ఆర్, కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్స్ పాటించాలన్నారు ఈటెల