ప్రశ్నించినందుకే ఈటలను పార్టీ నుంచి తొలగించారు 

ప్రశ్నించినందుకే ఈటలను పార్టీ నుంచి తొలగించారు 

ప్రజలు తమ పట్ల ఎంతో ఆదరణ చూపిస్తున్నారని తెలిపరు మాజీ  మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున. ఈటల రాజేందర్ ను గతంలో కంటే ఎక్కువగా గుండెల్లో పెట్టుకుంటామని చెబుతున్నారని తెలిపారు. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రం తెచ్చి.. మా కోసం ఎంతో పని చేసిన ఈటలను గెలిపించుకుంటామని స్థానికులు చెబుతున్నారన్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రజలు మా వెంట ప్రచారానికి వస్తున్నారని తెలిపారు జమున.

ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో తెలంగాణ తెచ్చుకుంటే  ఉద్యోగాలు లేకపోగా..అడిగిన వారిపై కేసులు పెడుతున్నారని యువత చెబుతోందన్నారు ఈటల జమున. ఏడేళ్లుగా టీఆర్ఎస్ పార్టీలో ఉండి చేయలేని పనులు ఇకపై బీజేపీ ద్వారా సాధించుకుంటామన్న ధీమా స్థానికుల్లో కనిపిస్తోందన్నారు. సెక్రటేరియట్ కట్టేందుకు ప్రభుత్వానికి డబ్బులుంటున్నాయి కానీ.. పేదల ఇళ్లకు మాత్రం దగ్గర డబ్బుల్లేవా అని ప్రశ్నించారు. ఇవన్నీ అడిగినందుకే ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. 

ఇప్పటి వరకు రేషన్ కార్డులు, ఫించన్లు అడిగితే ఇవ్వలేదు కానీ.. ఇప్పుడు ఎన్నికలు వచ్చే సమయం దగ్గర పడుతుండటంతో ఏదీ అడిగితే అది ఇస్తామంటూ ప్రభుత్వం హామీలు ఇస్తోందని విమర్శించారు ఈటల జమున. ఇలాంటి సర్కారు మనకు వద్దన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకునేవారినే గెలిపించాలన్నారు. ఓటుకు పదివేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నారని..ప్రలోభాలను నమ్మవద్దన్నారు. ఓటేసిన తర్వాత అన్నీ మర్చిపోతారన్నారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు.