నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి రూ.30 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. శనివారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిశారు.
నర్సంపేట నియోజకవర్గ సమస్యలు, అభివృద్ది పనులపై సీఎంకు ఎమ్మెల్యే దొంతి వివరించగా, నిధులు మంజూరు చేశారని, త్వరలోనే పనులకు సంబంధించిన జీవో రానున్నట్లు వివరించారు. నిధులుజూరు చేసిన సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
